నార్త్ లో యోగి కి పోటీగా సిద్ధమవుతున్న సౌత్ యోగి.. పవన్ కళ్యాణ్ భారీ స్కెచ్..
బీజేపీ (BJP)పార్టీలో యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) గురించి తెలియని వారు ఉండరు. 2017లో యూపీలో (Uttar Pradesh) ఆయన్ని సీఎంగా ప్రతిపాదించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటికే ఎన్నోసార్లు బీజేపీ ఎంపీగా ఎన్నికైన యోగి ఆదిత్యానాథ్ ఫక్తు హిందుత్వ వాది కావడంతో యూపీలో కమలాన్ని వికసింప చేసే బాధ్యత ఆయనకు అప్పగించారు. రెండుసార్లు బీజేపీని (BJP) యూపీలో గెలిపించడంలో యోగి ఆదిత్యానాథ్ సఫలీకృతుడయ్యాడు. అయితే 2024 లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి పెద్దగా అక్కడ సీట్లు రాలేదు.
నిజానికి యూపీలో బీజేపీ కి వచ్చిన ఓట్ల విషయంలో పెద్దగా తేడా లేనప్పటికీ ఎస్పీ కాంగ్రెస్ (Congress) కాంబో ఆ పార్టీని దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలకు బీజేపీ తన వంతు రిపేర్లు మొదలుపెట్టింది. ఇక ఆ విషయం పక్కన పెట్టే నార్త్‌లో యోగి బాబా లాగా సౌత్ లో కూడా బీజేపీ కి ఓ ఫేవరెట్ బాబా దొరికారు అని పబ్లిక్ టాక్. ఆ బాబా మరెవరో కాదండి ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). సాధారణంగా ఉత్తరాదినం ఉన్నంతగా హిందుత్వం గురించి దక్షిణాదిన వేడి ఉండదు అని అందరూ భావిస్తారు. అయితే ఇప్పుడు ఆ మాటని తిప్పి రాస్తూ వరుస పూజలు, హోమాలు, దీక్షలతో పవన్ కళ్యాణ్ సరికొత్త బాబా అవతారాన్ని ధరిస్తున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం పవన్ కళ్యాణ్ చేపడుతున్న అనేక రకమైన కార్యక్రమాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం విలువలు మర్చిపోతున్న ఎందరికో పవన్ కళ్యాణ్ స్ఫూర్తి అని కొందరు భావిస్తున్నారు.
మరి ముఖ్యంగా తాజాగా తిరుమల లడ్డు ( Tirumala Laddu) విషయంలో జరుగుతున్న కాంట్రవర్సీలో పవన్ తన గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. అంతేకాదు దేవాలయంలో జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా దీక్షను చేపట్టి.. హిందూ మతం మీద జరుగుతున్న దాడులకు హిందువులు అంతా ఒకటవ్వాలి అని పిలుపునిస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం తన ప్రాణాలను సైతం విడవడానికి సిద్ధంగా ఉన్నాను అని పవన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏ రేంజ్ లో వైరల్ అయిందో అందరికీ తెలుసు.
ఒక వర్గం పవని సమర్థిస్తుంటే మరి కొంతమంది మాత్రం పవన్ చేస్తున్న ఈ పనులు, మాట్లాడుతున్న మాటలు ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉన్నాయి అని అంటున్నారు. ఒకప్పుడు రాష్ట్రంలో మతపరమైన రచ్చలు ఏ రేంజ్ లో జరిగాయో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు అన్ని సద్దుమణికి ప్రజలు పరస్పర సోదర భావంతో ప్రశాంతంగా ఉన్న సమయంలో ఎటువంటి మాటలు లేనిపోని అల్లర్లకు దారి తీసే అవకాశం కూడా ఉంది అని మరి కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనాప్పటికీ పవన్ కళ్యాణ్ లాంటి చరిష్మా ఉన్న నేత.. సనాతన హిందూ ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ గా సౌత్ లో మారడం కమలనాధులకు ప్లస్ పాయింట్ అవుతుంది. పవన్ కి ఉన్న గ్లామర్ కి, ప్రజల్లో ఉన్న క్రేజ్ కి, హిందుత్వాన్ని మిక్స్ చేసి బీజేపీ సౌత్ ఇండియాలో కూడా రాజకీయ పంట పండించడానికి సిద్ధమవుతోంది అనిపిస్తుంది.













