Pawan Kalyan: ఈ నివేదిక చాలా అద్భుతం..ఇది అందరికీ మేలు చేస్తుంది
ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయి వరకు వచ్చిందంటే మందకృష్ణ మాదిగ, ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కారణమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై ఆయన మాట్లాడారు. మాదిగ అని చెప్పగలిగే గుండె దైర్యం కలిగిన వ్యక్తి మందకృష్ణ (Mandakrishna). ఆ కులానికి వచ్చె తెచ్చిన ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై చాలా చర్చలు జరిగాయి. గుర్తింపు లేని కులాలపైనా విస్తృతంగా చర్చలు జరిగాయి. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి రాజీవ్ రంజన్ మిశ్రా (Rajiv Ranjan Mishra ) తో ఏకసభ కమిషన్ ఏర్పాటు చేశారు. కమిషన్ ఇచ్చిన నివేదిక చాలా అద్భుతంగా ఉంది. ఇది అందరికీ మేలు చేస్తుందని ఆశిస్తున్నా అని పవన్ అన్నారు.













