శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వూరుకోం
సభలు, ర్యాలీల పేరిట శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తానంటే పోలీస్ శాఖ చూస్తూ కూర్చోదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు సృష్టం చేశారు. ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశానికి డీజీపీ హాజరయ్యూరు. అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ ఆందోళన సందర్భంగా హింస చెలరేగిన మాట వాస్తవమేనని ఇందులో పోలీసుల వైఫల్యమూ ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో మొత్తం 12 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తామంటే ఎట్టి పరిస్థితులలోనూ పోలీసు శాఖ ఉపేక్షించదని హెచ్చరించారు. నిన్న జరిగిన ఘటనలో ప్రతి కేసునూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది సభకు వచ్చేందుకు ప్రయత్నించారని, చాలామందిని ముందస్తుగానే అరెస్టు చేశామని తెలిపారు. రెండు బస్సులు, ఒక పోలీసు వాహనాన్ని ఆందోళనకారులు దగ్ధం చేశారని డీజీపీ వెల్లడించారు.













