చంద్రబాబుకు భద్రత తగ్గించలేదు
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు భద్రత తగ్గింపు వ్యవహారంపై రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ స్పందించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎంకు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం భద్రత తగ్గిస్తోందనడం సరికాదన్నారు. నిబంధనల ప్రకారం ఆయనకు ఇవ్వాల్సిన భద్రత కంటే ఎక్కువగానే కల్పించామని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. కొన్నిసార్లు వ్యక్తిగత గొడవలకు కొందరు రాజకీయ ముద్రవేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో పెట్టిన కేసుల తొలగింపు దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో ఒకరిపై మరొకరు పోస్టు పెట్టుకుంటున్నారన్న డీజీపీ.. వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని తెలిపారు













