Supreme Court : డిప్యూటీ స్పీకర్ రఘురామకు సుప్రీంకోర్టులో ఊరట
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు (Supreme Court ) లో ఊరట లభించింది. ఎంపీ (MP) గా ఉన్న సమయంలో హైదరాబాద్లోని గచ్చిబౌలి పీఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ భాషా (Constable Basha) పై దాడి చేశారంటూ గతంలో రఘురామతో పాటు ఆయన కుమారుడు భరత్ (Bharat), కార్యాలయ సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఆ కేసును ఇకపై కొనసాగించుకోదల్చుకోలేదని కానిస్టేబుల్ బాషా తాజాగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ జేకే మహేశ్వరి ధర్మాసనం, రఘురామ, ఆయన కుమారుడు సిబ్బందిపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ ఆదేశాలు ఇచ్చింది.













