Raghurama: ఆయన్ను చూసి జాలిపడటం తప్ప..ఇంకేమి చేయలేం : రఘురామ
నేరగాళ్లకు మాజీ సీఎం జగన్ (Former CM Jagan) పరామర్శ, దిగజారుడు ఓట్ల రాజకీయాని పరాకాష్ట అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (Raghuramakrishna Raju) అన్నారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవు అనే సామెత జగన్‌లాంటి వారిని చూసే వచ్చింది. గంజాయి బ్యాచ్‌ను పరామర్శించి రాజకీయంగా ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులపై హత్యాయత్నం చేసిన నిందితులకు జగన్ అండదండలా? నాడు ఎంపీ (MP)గా ఉన్నప్పుడు అప్పటి అధికారి సునీల్‌కుమార్ (Sunil Kumar)తో నన్ను కస్టడిలో కొట్టించింది జగనే. ఆయన్ను చూసి జాలిపడటం తప్ప ఇంకేమీ చేయలేం అని ఎద్దేవా చేశారు.













