Pawan Kalian :సింగపూర్ దౌత్యాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ
సింగపూర్ దౌత్యాధికారులతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalian) సమావేశమయ్యారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్ (Edgar Pang), కాన్సుల్ వైష్టవి వాసుదేవన్(Vaishtavi Vasudevan) పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు, ప్రజల సహకార, సంయుక్త అభివృది, అవకాశాలను అన్వేషించే మార్గాలు తదితర అంశాలపై చర్చించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ అనంతరం సింగపూర్ (Singapore )దౌత్య కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. తమకు ఘనమైన ఆతిథ్యం ఇచ్చినందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పేర్కొంది. సింగపూర్-ఆంధ్రప్రదేశ్ మధ్య సుదీర్ఘ మైత్రి ఉందని స్పష్టం చేసింది. ఏపీ-సింగపూర్ సంబంధాల బలోపేతం దిశగా ఈ భేటీ జరగడం అభినందనీయమని సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్ తెలిపారు.













