ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వల్ల ప్రాణహాని ఉందని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ముఖ్యమంత్రి జగన్కు చంద్రబాబుతో పాటు ఇతర నేతల వల్ల హాని జరిగే అవకాశం ఉందన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో శాంతి భద్రతలను దెబ్బతీసేందుకు చంద్రబాబు టీడీపీ నేత పట్టాభితో సీఎంను అసభ్య పదజాలంతో దూషింపచేశారని అన్నారు. సీఎంతో పాటు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, కొడాలి నానిలను చంపేందుకు సామాజిక వర్గం చందాలు పోగు చేస్తోందని ఆరోపించారు.













