ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. సంచలన వ్యాఖ్యలు
భవిష్యత్తులో జగన్ ప్రధాని అయ్యే అవకాశం ఉందంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి పదవి ఇచ్చే నాడు రెండున్నర సంవత్సరాలు కాలపరిమితి మాత్రమే ఉంటుందని సీఎం చెప్పారని తెలిపారు. ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా తాము శిరసావహిస్తామని స్పష్టం చేశారు. అన్ని శక్తులు ఏకమైనా జగన్ను ఏమి చెయ్యలేరన్నారు. సీఎంగా జగనే కొనసాగుతారని తెలిపారు. ఎన్టీరామారావుకు వారసులు ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో వేషాలు వేసే రాజకీయాలకు పనికిరారు అన్ని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే కొత్త పార్టీ పెట్టి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ఒక్క సీటు గెలిచినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు.













