వైఎస్ జగన్ ను బ్రహ్మదేవుడు కూడా జైలుకు పంపించలేడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా ఎలాంటి చిన్న తప్పు కూడా చేయలేదని అనవసరంగా ఆయనపై బురద చల్లుతున్నారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్కు జైలుకు పంపిస్తామంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సింహమని, ఎవరికీ భయపడరన్నారు. ఆయన్ను బ్రహ్మాదేవుడు కూడా జైలుకు పంపించలేడని అన్నారు. ఇటీవల విజయవాడ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చీప్లిక్కర్పై చేసిన వ్యాఖ్యలను నారాయణస్వామి తప్పుబట్టారు. మధ్యం ఇస్తామని చెప్పి ఎవరైనా ఓట్లు అడుగుతారా అని ప్రశ్నించారు. సోము వీర్రాజు ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతోందా? అని ప్రశ్నించారు.













