ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమత్రి నారాయణస్వామి ఏం మాట్లాడినా సంచలమే. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురంలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వారసుడిగా సీఎం జగన్ రాజకీయాల్లో రాలేదని ఉప ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు జగన్ వైఎస్ వారసుడే కాదన్నారు. పాదయాత్రలో అందరి కష్టాలను చూసి కష్టపడి రాజకీయాల్లోకి నిలదొక్కుకున్నారనని అన్నారు. ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయావర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి.













