ఏపీ డిప్యూటీ సీఎం సంచలన ప్రకటన
ఆంధప్రదేశ్ డిప్యూటీ సీం ఎ కె.నారాయణ స్వామి సంచలన ప్రకటన చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ ఒంటరిగా నిలబడి ఒక్క స్థానం గెలిస్తే, చంద్రబాబు ఇంట్లో తాను పాచి పని చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఉన్న వాళ్లకోసం తపన పడతారని అదే సీఎం జగన్ లేని వాళ్ల కోసం తపిస్తారని తెలిపారు. గతంలో తనను కూడా టీడీపీలోకి లాక్కునేందుకు ఎంతో మందితో చంద్రబాబు బేరాలు ఆడించారని ఆరోపించారు. తాను డబ్బులకు, పదవులకు లొంగే వ్యక్తిని కాదనే విషయాన్ని అప్పట్లోనే నిరూపించానని గుర్తు చేశారు. తాను అవినీతి పరుడని నిరూపిస్తే, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని ఆయన పేర్కొన్నారు.
2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేసి, రెడ్లకు మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు. ఒక్క ఎస్సీకి అవకాశం కల్పించారా అని ప్రశ్నించారు. ఎస్సీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.













