ఏపీ డిప్యూటీ సీఎం మరోసారి.. వివాదస్పద వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దుష్టపాలనను అంతమొందించడడానికే భగవంతుని స్వరూపంలో జగన్ సీఎం అయ్యారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం నాణ్యతలేని రోడ్లు వేసి దోచేసుకున్నారని ఆరోపించారు. కాబట్టే ఆ వరుణదేవుడు కూడా ఓర్చుకోకుండా వారికి బుద్ది రావడానికి రోడ్లను ఇలా పాడు చేసాడని అన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ లేనప్పుడు రెచ్చగొట్టేలా ప్రవర్తించింది చంద్రబాబేనని అన్నారు. గొడ్డలి, బాబాయ్, చెల్లి, తల్లి అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడిరదని చంద్రబాబేనన్నారు. అందుకే మాధవ రెడ్డి, వంగవీటి మోహన రంగా హత్యలపై విచారణ జరిపించాలని వైసీపీ కోరిందన్నారు. దాంతో చంద్రబాబు జీర్ణించుకోలేక పవిత్రమైన భార్యను తెర పైకి తీసుకు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ చేస్తున్నారని విమర్శించారు.













