మంత్రి ఆళ్లనాని ఓటు గల్లంతు
వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని ఓటు గల్లంతైంది. ఏలూరు 25 వ డివిజన్లోని శనివారపు పేటలోని పోలింగ్ కేంద్రంలో ఈయన ఓటు హక్కు వేయాల్సి ఉంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి మంత్రి అక్కడికి వెళ్లారు. తీరా వెళ్లి చూసే సరికి ఓటర్ల జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. దీనిపై అధికారులను మంత్రి వివరణ అడిగారు. కాసేపు వేచి చూసిన తర్వాత పోలింగ్ బూత్ నుంచి మంత్రి వెనుదిరిగారు. మరోవైపు అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రజలు తమ ఓటును వినియోగించుకోవాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు కోరారు. 37 వ డివిజన్లో మంత్రి కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు అనేది ఓ ఆయుధమని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అయితే ఓటు వేసే సందర్భంలో అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు.













