నవనిర్మాణ దీక్షలకు ఏర్పాట్లు ముమ్మరం
జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులపాటు జరుగనున్న నవనిర్మాణ దీక్షల విజయవంతానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ ఆదేశించారు. 2న విజయవాడలో నిర్వహించే దీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారని తెలిపారు. దీక్షల ఏర్పాట్లపై పలు శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 2 నుంచి 8 వరకు ప్రతి గ్రామం, వార్డుల్లో నవనిర్మణ దీక్ష చర్చవేదిక నిర్వహించాలన్నారు. కాగా రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర పథకాలు పూర్తిచేసేందుకు అవసరమైన భూములను త్వరితగతిన సేకరించాలని సీఎస్ ఆదేశించారు.













