ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ సర్వీస్ పొడిగింపు?

ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ నెలాఖరుకు పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన సర్వీసు మరో ఆరు నెలలు పొడిగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలోనే ఆదిత్యనాథ్ దాస్ సర్వీసు పొడిగింపును కేంద్రానికి పంపాల్సి ఉండగా నెల రోజుల ఆసల్యం జరిగింది. కాగా ఈ నెల 15వ తేదీలోపే ఆదిత్యనాద్ దాస్ సర్వీసు పొడిగింపుకు ఉత్తర్వులు ఇవ్వటం ఖాయమని తెలుస్తోంది. నీలం సాహ్ని తరహాలో మొదటి మూడు నెలలు సర్వీసు పొడిగింపుకు అనుమతి ఇస్తారని, ఆ తరువాత మరో మూడు నెలలు సర్వీసు పొడిగింపుకు అనుమతి ఇస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆదిత్యనాథ్ దాస్ సీఎస్‍గా ఈ ఏడాది డిసెంబరు వరకు బాధ్యతలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.