Ramakrishna: ఆపరేషన్ బుడమేరు అమలు చేయాలి : రామకృష్ణ
ఆపరేషన్ బుడమేరు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) కు సీపీఐ నేతలు వినతి పత్రం అందించారు. విజయవాడాలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రామకృష్ణ ఆధ్వర్యంలో పలువురు నేతలు రామానాయుడిని కలిశారు. మూడు వేలకు పైగా ఉన్న ఆక్రమణలు తొలగించాలని కోరారు. అనంతరం రామకృష్ణ(Ramakrishna) మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది వరదలు వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు (Chandrababu) స్పందించిన తీరుపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఉంది. ఆ సందర్భంలో ఆయన చెప్పిన ఆపరేషన్ బుడమేరు (Operation Budameru) పై మాత్రం ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వర్షాకాలం నేపథ్యంలో బుడమేరుకు వరదపై మరోసారి ప్రజల్లో ఆందోళన నెలకొంది. మొత్తం పనులు పూర్తి చేసేందుకు రూ.8 వేల కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మాటలు చెబుతోంది తప్ప ఏపీకి నిధులు ఇవ్వడంలో ఆలస్యం చేస్తోంది. కేంద్రం నుంచి ఏపీకి డిజాస్టర్ మేనేజ్మెంట్ (Disaster Management) కింద నిధులు ఎందుకు ఇవ్వడం లేదు? ఆపరేషన్ బుడమేరు చేపట్టాలి. ఆక్రమణలు తొలగించాలి అని అన్నారు.













