ఏపీలో కొత్తగా 20 వేలకు పైగా కేసులు.. 82 మంది

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో మరో 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,15,784 శాంపిల్స్ పరీక్షించగా.. 20,034 మందికి పాజిటివ్‍గా నిర్ధారణ అయినట్టు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. అలాగే 82 మంది మృతి చెందినట్లు తెలిపారు. వైరస్ బారిన పడి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ సౌకర్యం ఉన్న బెట్‍లు 21,850 ఉన్నాయని తెలిపారు. రెమ్‍డెసివిర్ ఇంజెక్షన్ల కొరత లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.346 కోట్లు కేటాయించినట్టు చెప్పారు.