సీనియర్లకే అవకాశాలు…మిగిలిన వారు త్యాగాలు చేయాల్సిందే
ఆంధ్రప్రదేశ్లోనూ తెలుగుదేశంతో పొత్తు ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి సృష్టమైన సంకేతాలు పంపినట్లు తెలిసింది. అదే సమయంలో పార్టీ నేతల్లో పొత్తుపై ఆందోళన రేకెత్తించేలా మాట్లాడినట్లు తెలిసింది. విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జిల్లాల కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్రంలో తెలుగుదేశంతో పొత్తు ఉంటుంది. పార్టీ బలంగా ఉన్నచోట నాలాంటి సీనియర్లకే అవకాశాలు వస్తాయి. మిగిలి నవారు ఆశలు వదులుకోవలసిందే. త్యాగాలు చేయాల్సిందే అని రఘువీరా వ్యాఖ్యానించినట్లు సమాచారం. పొత్తులపై పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీసుకునే నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని కూడా ఆయన కోరారు.













