సీఎం వైఎస్ జగన్ కు ఘన స్వాగతం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ తొలిసారిగా సచివాలయంలో అడుగుపెట్టారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి నేరుగా సచివాలయానికి చేరుకున్న సీఎం ఉదయం 8:39 గంటలకు సచివాలయంలోని తన ఛాంబర్లో అడుగుపెట్టారు. పూజా కార్యక్రమాలు వేదపండితుల ఆశీర్వచనం అనంతరం కీలక దస్త్రాలపై సీఎం సంతకం చేశారు. ఆశా వర్కర్ల వేతనం రూ.10 వేలకు పెంపు దస్త్రంపై మొదటి సంతకం, అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేకి ఏపీ నుంచి అంగీకారపత్రంపై రెండో సంతకం, జర్నలిస్టుల సమగ్ర బీమా దస్త్రంపై మూడో సంతకం చేశారు. ఇవాల్టి నుంచి సచివాలయం కేంద్రంగా ముఖ్యమంత్రి జగన్ కార్యకలాపాలు నిర్వహించనున్నారు.













