ఈ దేశం ఏపీ వైపు చూసేలా చేస్తాను : జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో విజయం, ప్రమాణస్వీకారంపై ట్విటర్ వేదికగా స్పందించిన జగన్.. ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేస్తానని, సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. అపూర్వ విజయం అందించిన ప్రతి ఒక్కరికీ, ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నాపై పెద్ద బాధ్యత పెట్టారు. మీ అంచనాలకు తగ్గట్టు పనిచేస్తాను. ఈ దేశం గర్వంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా సుపరిపాలన అందిస్తాను అని పేర్కొన్నారు.













