డిసెంబర్ 26న కడప ఉక్కుకు శంకుస్థాపన
కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పనులు నిలిచిపోయాయని గత పాలకులు దీనిపై ఎన్నో డ్రామాలు చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా కడప జిల్లాలోని జమ్మలమడుగులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా ప్రజల సమస్యలను ఉద్దేశించిన జగన్ పలు హామీలు ఇచ్చారు. కడప ఉక్కు పరిశ్రమ ఏ పనీ జరగక ఆగిపోయిన పరిస్థితిలో ఉంది. డిసెంబర్ 26న జగన్ అనే నేను వచి అదే ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తానని హామీ ఇస్తున్నా. మూడేళ్లలోనే ఆ ప్రాజెక్టును పూర్తి చేసి మీ అందరికీ అందిస్తానని మాటిస్తున్నా. మీ అందరి కలల్ని సాకారం చేస్తానని సగర్వంగా చెబుతున్నా. ఈ ప్రాజెక్టు ద్వారా 20 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అని జగన్ హామీ ఇచ్చారు.













