ఆంధ్రలో కరోనా కల్లోలంపై ఉన్నత స్థాయి సమీక్ష…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనూహ్య సంఖ్యలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్న నేపధ్యంలో కరోనా నివారణపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాదికారులతో ఆర్ అండ్ బి అతిధి గృహంలోని సమావేశ మందిరంలో శనివారం ఏపి ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్షా సమవేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపి మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, రాష్ట్ర కరోనా నోడల్ ఆఫీసర్ కృష్ణ బాబు, ఎం డి విజయరాజు, ఏపి మెడికల్ కౌన్సిల్ బోర్డు చైర్మన్ డాక్టర్ శివ రెడ్డి, ఆరోగ్య శ్రీ సీఈఓ డాక్టర్ మల్లి ఖార్జున, డైరెక్టర్ డాక్టర్ అరుణ కుమారి… పలువురు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాదికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఆళ్లనాని మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలనిరాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోవిడ్ హాస్పిటల్స్ లో అత్యవసర మందులు అందుబాటులోలోకి తీసుకురావాలని ఏపి ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి అదేశాలు జారీ చేశారన్నారు. కరోనా బాధితులకు ఎంత ఖర్చు అయినా వెనుకడుగు వేయవద్దని సీఎం వైస్ జగన్మోహనరెడ్డి స్పష్టం చేశారన్నారు. కోవిడ్ మరణాలు తగ్గిo చడం పై ప్రత్యేకంగా చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ బాధితుల కోసం నెలవారీగా రూ. 200కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. డాక్టర్స్ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఐ ఎం ఏ ప్రతినిధి బృందంతో మాట్లాడుతున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్స్ , పారా మెడికల్ సిబ్బంది, శానిటేషన్.. సిబ్బందిని పెంచుతున్నామన్నారు. అలాగే ఆరోగ్య శ్రీ హాస్పిటల్స్ బెడ్స్ పెంచాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 139కోవిడ్ హాస్పిటల్స్ త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఆక్సిజన్ సౌకర్యంతో 22, 500 బెడ్స్ అందుబాటులో ఉంచామన్నారు. త్వరలో మరో 10వేల బెడ్స్ ఆక్సిజన్ సౌకర్యంతో అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని కోవిడ్ హాస్పిటల్స్ కు 10వేల డోసుల చొప్పున పంపిస్తున్నామని, ఆగష్టు మూడవ వారం నాటికీ దాదాపు గా 90వేల పైగా డోసుల ఇంజక్షన్ కోవిడ్ హాస్పిటల్స్ లో అందుబాటులో ఉంచుతామని వివరించారు.
రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లలో ఎన్ని బెడ్స్ ఉన్నాయి…హాస్పిటల్ ఆవరణలో వివరాలు అందుబాటులో ఉంచాలని అలాగే వీటి కోసం ఒక వెబ్ సైట్ కూడ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రములో ఇప్పటికే హెటిరో నుంచి రెమ్ డే సి వ ర్ కొనుగోలు చేశామన్నారు. గణాంకాల ప్రకారం క్రిటికల్ కేర్ చికిత్స అవసరమైన రోగుల సంఖ్య పాజిటివ్ కేసుల్లో 7నుంచి 8%వరకు ఉంటుందన్నారు. కోవిడ్ కోసం ప్రత్యేకంగా చికిత్స అందించే హాస్పిటల్స్ పెంపు, అందులో సదుపాయాలు కల్పన కోసం వచ్చే 6నెలల్లో దాదాపు గా 1000కోట్లు రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. కరోనా కారణం గా తీవ్ర అస్వస్థత కు గురైన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తామన్నారు. కంటైన్మెంట్ క్లస్టర్స్.. కోవిడ్ సోకడానికి ఆస్కారం అధికంగా ఉన్న వారి పై ద్రుష్టి పెట్టి పరీక్షలు జరిపిస్తూన్నా మని పెరుగుతున్న కేసులు దృష్ట్యా మరో 54హాస్పిటల్స్ కోవిడ్ బాధితులు కోసం ఎంపిక చేశామన్నారు. క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం… పారిశుధ్య o.. కూడ మెరుగుగా ఉండాలని సీఎం ప్రత్యేకంగా అదేశాలు ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి రోజు కోవిడ్ పరీక్షల కోసం 5కోట్లు రూపాయలు, అలాగే క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం, పారిశుధ్య o కోసం రూ. 1.5కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.













