సంక్షేమ క్యాలెండర్ ను ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలతో కూడిన సంక్షేమ క్యాలెండర్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల శాసనసభలో ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల వివరాలతో ఈ సంక్షేమ క్యాలెండర్ను రూపొందించారు. ఈ సంవత్సరం దాదాపు రూ.55 వేల కోట్లు నేరుగా (డీబీటీ) లబ్ధిదారులకు అందించబోతున్నాం. పరోక్షంగా మరో రూ.17,305 కోట్ల మేర ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. దేశ చరిత్రలోనే ఈ స్థాయిలో డీబీటీ, పారదర్శక పాలన ఎక్కడా అందడం లేదు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎప్పుడు, ఏ నెలలో ఇస్తున్నామో సందేహాలకు తావు లేకుండా ముందే ప్రకటించి సంక్షేమ క్యాలెండర్ అమలు చేస్తున్నాం. లబ్ధిదారులు వారి కుటుంబ అవసరాలకు అనుగుణంగా ప్లాన్ చేసుకునే వీలు కల్పిస్తున్నాం. ఈ పథకాలు ఎలా అమలవుతున్నాయో రాష్ట్రంలో ఏ రైతన్నను అడిగినా చెబుతాడు. పిల్లలు, అక్కచెల్లెమ్మలు, ప్రతి అవ్వాతాతను అడిగినా చెబుతారు. సంతోషం వారి కళ్లల్లో కనిపిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మార్చి 2023 వరకు మనందరి ప్రభుత్వం వివిధ డీబీటీల ద్వారా ఏ పథకం ఏ నెలలో అందబోతుందో వివరిస్తూ సంక్షేమ క్యాలెండర్ను జగన్ ప్రకటించారు.
ఏప్రిల్ మాసంలో..
* వసతి దీవెన, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు వడ్డీలేని రుణాలు ఇచ్చే కార్యక్రమం.
మే మాసంలో..
* విద్యా దీవెన (జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించి), అగ్రి కల్చర్ ఇన్సూరెన్స్ ఖరీఫ్ 2021, వైయస్ఆర్ రైతు భరోసా పథకం, మత్య్సకార భరోసా
జూన్ మాసంలో..
* అమ్మ ఒడి పథకం. ఈ ఒక్క పథకానికే రూ.6500 కోట్లు.
జూలై మాసంలో..
* విద్యా కానుక- వాహన మిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడు, సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులు ఎవరైనా మిగిలిపోయి ఉంటే దరఖాస్తు చేసుకున్నవారికి ప్రతి సంవత్సరం జూలై, డిసెంబర్లో అవకాశం ఇస్తామని చెప్పిన మాట ప్రకారం మిగిలిపో యిన అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తాం.
ఆగష్టు మాసంలో..
* విద్యా దీవెన, ఎంఎస్ఎంఈలకు ఇన్సెన్టివ్, నేతన్న నేస్తం
సెప్టెంబర్లో ..
* వైయస్ఆర్ చేయూత. ఈ ఒక్క పథకం ద్వారా బటన్ నొక్కిన వెంటనే దాదాపుగా 25 లక్షల మందికి మేలు చేస్తూ రూ.4500 కోట్లు విడుదల చేయనున్నాం.
అక్టోబర్లో..
* వసతి దీవెన, రైతు భరోసా
నవంబంలో..
* విద్యా దీవెన మూడవ విడత, రైతులకు వడ్డీలేని రుణాలు
డిసెంబర్ మాసంలో..
* ఈబీసీ నేస్తం, లా నేస్తం పథకాలు
* సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులు ఎవరైనా మిగిలిపోయి ఉంటే దరఖాస్తు చేసుకున్నవారికి ప్రతి సంవత్సరం జూలై, డిసెంబర్లో అవకాశం ఇస్తామని చెప్పిన మాట ప్రకారం మిగిలిపోయిన అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తాం.
జనవరిలో..
* రైతు భరోసా మూడవ విడత, వైయస్ఆర్ ఆసరా దాదాపుగా 79లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తూ రూ.6700 కోట్లు అందించనున్నాం. జగనన్న తోడు – జనవరి మాసంలోనే పెన్షన్ రూ.2500 నుంచి రూ.2750కి పెంచి అందజేస్తాం.
* విద్యా దీవెన నాల్గవ విడత, జగనన్న చేదోడు పథకాలు
మార్చి మాసంలో..
* వసతి దీవెన అమలు













