చండీయాగం పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం జగన్
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎస్సాఆర్ కల్యాణ మండపంలో నిర్వహించిన మహారుద్ర సహిత ద్విసహస్ర చండీయాగం పూర్ణాహుతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి వైకాపా నేత వరప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండేళ్లు నుంచి నిర్విఘ్నంగా కొనసాగిన చండీయాగం నేటితో ముగిసింది. పూర్ణాహుతి ముగిసిన అనంతరం పండితులు ముఖ్యమంత్రి జగన్కు ఆశీర్వచనాలు అందజేశారు. యాగంలో పాల్గొన్న పండితులకు ముఖ్యమంత్రి శాలువా కప్పి, కంకణం తొడిగి సత్కరించారు.













