3 రాజధానులతోనే అభివృద్ధి:జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంపై సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకే ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకృతమవడం. సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ మీడియా తో ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఒకే ప్రాంతంలో రూ.లక్షల కోట్లు ఖర్చు పెడితే మిగిలిన ప్రాంతాల సంగతి ఏమిటని ప్రశ్నించారు. రాజధాని కోసం వేల ఎకరాల్లో సరికొత్తగా నగర నిర్మాణం అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజధాని కి భూముల సేకరణ లో అనేక అవకతవకలు జరిగాయని వాటిపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.













