సీఎం వైఎస్ జగన్ ను కలిసిన పీవీ సింధు
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధు కలిశారు. సచివాలయంలో సీఎం ఛాంబర్లో సింధు కలిసింది. ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన సింధును ముఖ్యమంత్రి అభినందించారు. ఈ సందర్భంగా ఆమెను ముఖ్యమంత్రి జగన్ సత్కరించారు. మీ ఆశీర్వాదంతో కాంస్యం సాధించానని ముఖ్యమంత్రి జగన్తో సింధు అన్నారు. దేవుడి దయతో మంచి ప్రతిభ చూపారని ముఖ్యమంత్రి అభినందించారు. విశాఖలో వెంటనే అకాడమీని ప్రారంభించాలన్నారు. రాష్ట్రం నుంచి మరింత మంది సింధులు తయారు కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వం తరపున సింధుకు రూ.30 లక్షల నగదును అధికారులు అందించారు.













