కొత్త మంత్రుల జాబితాను గవర్నర్కు అందజేసిన ఏపీ సీఎం
గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. రేపు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వారి పేర్లను గవర్నర్కు ముఖ్యమంత్రి అందజేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులుగా మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో 20 మంది మంత్రులు ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. వైసీపీఎల్పీ సమావేశంలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ కీలక ప్రకటన చేశారు. కాగా ఇప్పటికే 25 మంది మంత్రులు ఎవరు? మంత్రులుగా అవకాశం ఎవరికి దక్కింది? అనే విషయంలో వైసీపీ అధిష్టానం ఎక్కడా లీకులు రాకుండా చూసుకుంటోంది.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏపీ మంత్రులుగా ఖరారైన వారికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక్కొక్కరికి ఫోన్ చేసి సమాచారం అందిస్తున్నారు. ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా చెబుతున్నారు. రేపు ఉదయం 11:49 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. సచివాలయంలో సమీపంలోనే ప్రమాణ స్వీకారానికి ఏరాట్లు జరుగుతున్నాయి. కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం తర్వాత తొలి కేబినెట్ భేటీ జరగనుంది. ఈ ఏర్పాట్లను పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించారు.













