40 నిమిషాల పాటు గవర్నర్ తో భేటీ అయిన ఏపీ సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ని కలుసుకున్నారు. వైఎస్ జగన్ సతీసమేతంగా గవర్నర్‌ను కలుసుకున్నారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరిరువురూ చర్చించుకున్నారు. అయితే గవర్నర్ కోటాలో నియమించాల్సిన ఎమ్మెల్సీల జాబితాను గవర్నర్ దగ్గరికి పంపంది ప్రభుత్వం. దీనిని గవర్నర్ పెండింగ్‌లో ఉంచారు. లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, రాజు, రమేశ్ యాదవ్ తో కూడిన జాబితాను ఏపీ ప్రభుత్వం గవర్నర్‌కు పంపింది. ఈ నలుగురి పేర్లపై గవర్నర్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే జగన్ గవర్నర్ విశ్వభూషణ్‌తో భేటీ అయ్యారని తెలుస్తోంది.