జగనన్న విద్యా దీవెన ప్రారంభించిన సీఎం
ఆంధప్రదేశ్‌లో మరో కొత్త పథకం ప్రారంభమైంది. జగనన్న విద్యా దీవెన పథకాన్ని తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దాదాపు 12 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, విద్యార్థుల తల్లులతో మాట్లాడారు. విద్యా దీవెనలో భాగంగా రెండు పథకాలు తీసుకొచ్చాం. బోర్డింగ్, లాడ్జింగ్ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వమే చెల్లిస్తుంది. పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి ఒక చదువే. మంచి చదువుతోనే పేదల బతుకులు మారుతాయి. మార్చి 31 వరకు పూర్తి బకాయిలను ఇస్తున్నాం అని తెలిపారు. 2018-19 లో గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రూ.1800 కోట్లు పూర్తిగా చెల్లిస్తున్నాం. ఈ ఏడాదికి సబంధించి ఒక్క పైసా కూడా బకాయి లేకుండా చెల్లిస్తున్నాం. 2020-21లోనూ ప్రతి త్రైమాసికం తర్వాత తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తాం. కళాశాలల్లో సదుపాయాలు లేకపోతే 1902కు తల్లులు ఫోన్ చేయవచ్చు అని ముఖ్యమంత్రి తెలిపారు.













