ఏపీ సీఎం సంచలన నిర్ణయం.. వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్‌తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే నెల 30 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు హాజరయ్యారు. మెడికల్ కాలేజీల నిర్మాణం, విలేజ్ అర్బన్ హెల్త్ ఏర్పాటుపై సీఎం సమీక్షించారు. ప్రభుత్వాస్పత్రుల్లో సిబ్బంది నియామకం, కోవిడ్ వ్యాక్సినేషన్ తదితర అంశాలపై చర్చించారు.













