సీఎం వైఎస్ జగన్ కు మంత్రి వెల్లంపల్లి ఆహ్వానం
మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురష్కరించుకోని శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆహ్వానించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ను మంత్రి వెల్లంపల్లితో పాటు శ్రీశైలం దేవస్థానం ఈఓ లవన్న, ఇతర అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.













