పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం
2022 ఖరీప్ నాటికి పోలవరం ద్వారా నీరందిస్తామని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆర్థిక పరమైన సమస్యలన్నీ పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. నిర్వాసితులకు న్యాయ చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలుత ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. సీఎం జగన్ వెంట మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఉన్నారు. స్పిల్‌వే వద్ద ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని ముఖ్యమంత్రి జగన్ పరిశీలించారు. అనంతరం కాఫర్ డ్యాం వద్దకు చేరుకొని కాఫర్ డ్యాం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మంత్రులు ఘన స్వాగతం పలికారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల పరిశీలనలో సీఎం వైఎస్ జగన్‌తో మంత్రులు మంత్రులు ఆళ్లనాని, తానేటి వనితా, చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎంపీ మార్గని భారత్, రాజ్యసభ సభ్యులు పిల్లిసుభాష్ చంద్రబోష్, కలెక్టర్లు రేవు ముత్యాల రాజు, మురళీధర్ రెడ్డి, ఎమ్మెల్మేలు తెల్లం బాలరాజు, రాపాక వరప్రసాద్, పుప్పాలవాసుబాబు, తల్లారి వెంకట్రావు, ముదునూరి ప్రసాదరాజు, ఏలూరు రేంజ్ డిఐజీ మోహనరావు, జిల్లా ఎస్పీ నారాయణ నాయక్‌లు పాల్గొన్నారు. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టును శరవేగంగా సాకారం చేసి రాష్ట్ర ప్రజలకు ఫలాలను అందచేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి గడువులోగా పూర్తి చేసేలా అధికారులకు దిశా నిర్దేశం చేశారు.













