ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ‘అమెరికన్ కార్నర్’ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్ర యూనివర్సిటీ(ఏయూ)లో ఏర్పాటు చేసిన ‘అమెరికన్ కార్నర్’ కేంద్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఏయూలో అమెరికన్ కార్నర్ ఏర్పాటు కావటం సంతోషకరమని, ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ చెప్పారు. అహ్మదాబాద్,హైదరాబాద్ తర్వాత విశాఖలో అమెరికన్ కార్నర్ ప్రారంభమైందని తెలిపారు. దేశంలో మూడో కేంద్రంగా.. అమెరిన్ కాన్సులేట్ సహకారంతో విశాఖలో ‘అమెరికన్ కార్నర్’ ఏర్పాటు చేశారు. యూఎస్ విద్య, ఉద్యోగావకాశాల సమాచారానికి సంబంధించి సేవలు అందించనుంది. ఈ కార్యక్రమంలో అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రీఫ్మెన్, యూఎస్ ఎయిడ్ ఇండియా డైరెక్టర్ వీణా రెడ్డి, ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి పాల్గొన్నారు.













