ఏపీ నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన మంత్రివర్గం కొలువుదీరింది. మొత్తం 25 మంది మంత్రులతో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. వెలగపూడలోని సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. మొత్తం 25 మందిలో ఇద్దరు ఇంగ్లీష్‌లో ప్రమాణ స్వీకారం చేయగా.. మిగిలిన మంత్రులంతా తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు.
మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసింది వీరే…
ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, పాముల పుష్ప శ్రీవాణి, ముత్తంశెట్టి శ్రీనివాసరావు (ఆవంతి శ్రీనివాస్), పిల్లి సుభాష్ చంద్రబోస్, పినిపె విశ్వరూప్, కురసాల కన్నబాబు, తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని వెంకట్రామయ్య (నాని), మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేశ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కె.నారాయణస్వామి, అంజద్ బాషా, యం.శంకరనారాయణ.













