ఘనంగా సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్కు వేద పండితులు ఆశీర్వదించారు. సీఎంతో కేక్ కట్ చేయించిన మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్కు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు బర్త్డే విషెస్ తెలిపారు. జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడంతో పాటు అన్నదానం, వస్త్రధానాలు చేశారు. అలాగే ఆస్పత్రుల్లో రోగులకు పండు పంపిణీ చేశారు.













