సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు. సంక్రాంతి పల్లెల పండుగ..రైతుల పండుగ. మన అక్కచెల్లెమ్మల పండుగ.. మన సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించే అచ్చ తెలుగు పండుగ అని అన్నారు. ప్రజలంతా సంతోషంగా పండగను జరుపుకోవాలని అభిలషించారు. ఈ మకర సంక్రాంతి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో మరింత ప్రగతితో కూడిన మార్పును తీసుకురావాలని ఆకాంక్షించారు. తెలుగు లోగిళ్లలో ప్రతి ఇంటా ఆనందాల సిరులు వెల్లివిరియాలని జగన్ ఆకాంక్షించారు.













