కేసీఆర్, స్టాలిన్ లకు జగన్ విందు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్‌లతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. విజయవాడలో ప్రమాణస్వీకారం ముగిసిన వెంటనే కేసీఆర్, స్టాలిన్లను మర్యాదపూర్వకంగా తాడేపల్లిలో తన నివాసానికి జగన్ తోడ్కొని వెళ్లారు. జగన్ ఢిల్లీ పర్యటన రద్దవడంతో వీరిని తన ఇంటికి ఆహ్వానించారు. కేసీఆర్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు. స్టాలిన్, వెంటన ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా వచ్చారు. వీరికి జగన్ తన నివాసంలో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్, కేసీఆర్ స్టాలిన్ వేరుగా కాసేపు భేటీ అయ్యారు. ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని వైకాపా వర్గాలు తెలిపాయి.













