ఐపీఎస్ అధికారులతో సీఎం కాన్ఫరెన్స్ ప్రారంభం
కలెక్టర్లు, ఐపీఎస్ అధికారుల కాన్ఫరెన్స్‌లో సీఎం వైయస్ జగన్. గంజాయి ఏరివేతకు ఆగస్టులో భారీ అపరేషన్ నిర్వహిస్తాం. గంజాయి సాగు చేయకుండా గిరిజనుల్లో అవగాహన కల్పించి వారి పునరావాసం కోసం చర్యలు తీసుకోండి. వారిపై కఠినంగా వ్యవహరించే బదులు, వారి జీవనోపాధికి మార్గాలు చూపుతాం. ఇంటెలిజెన్స్, గ్రేహౌండ్స్‌లతో సమన్వయం చేసుకుని ఒక ప్రణాళికతో రావాలన్న సీఎం. మళ్లీ గంజాయి సాగులోకి రాకుండా జీవనోపాధి పరిష్కారాలు చూడాలన్న సీఎం.
పోలవరం సునరావాస సమస్యపై దృష్టిపెట్టాలి:
ప్రజల ఫిర్యాదులు, అభ్యంతరాల పరిష్కారానికి శాశ్వతంగా గ్రీవెన్స్ కార్యాలయాన్ని పెట్టాలి. ఐఏఎస్ అధికారి ఈ గ్రెవన్స్ సెల్‌కు నేతృత్వం వహించాలి. పాదర్శకత, వేగవంతంగా ఈ సమస్యలను పరిష్కరించాలి. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తాం. పోలవరం పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉన్నాం. అన్ని ప్రాజెక్టులకన్నా.. దీనికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం.
కాల్‌మనీ సెక్స్‌రాకెట్ అంశంపై సీఎం సీరియస్
ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదన్న సీఎం వైయస్ జగన్. ఏ పార్టీవారు ఉన్నా విడిచిపెట్టొద్దని పోలీసు అధికారులకు ఆదేశం. పోలీసు వ్యవస్థను క్లీన్చేయాలని ఆదేశం. ఎవరికైనా ఫిర్యాదు ఉంటే వెంటనే తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. విజయవాడలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమన్న ముఖ్మమంత్రి.
కాలుష్యానికి స్పందించి నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటు:సీఎం
కఠినమైన, కచ్చితమైన విధానాన్ని తీసుకురావాలన్న సీఎం. జవాబుదారీ తనం ఉండాలని ఆదేశించిన సీఎం. కాలుష్యంతో సమాజానికి చేటు తెచ్చే వాటిపై దృష్టిపెట్టాలన్న సీఎం. కాలుష్యంపై నిఘా పెంచాలన్న ముఖ్యమంత్రి. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలన్న ముఖ్యమంత్రి. మంచి సాంకేతిక నిపుణులను కమిటీలో వేయాలన్న సీఎం. ప్రజల అభ్యంతరాలను తోసిపుచ్చి, బుల్డోజ్ చేసే పద్దతి వద్దని అధికారులకు ఆదేశం. కాలుష్యంపై ఎవరు అభ్యంతరం వ్యక్తంచేసినా దానిపై సానుకూల పరిశీలన చేయాలన్న సీఎం. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలపట్ల అప్రమత్తతో ఉండాలన్న సీఎం. భవిష్యత్ తరాలకు చేటు తెచ్చే పరిస్థితి ఉండకూడదన్న సీఎం.
అక్టోబరు 1 నాటికి బెల్టుషాపులు పూర్తిగా ఎత్తివేయాల్సిందే
అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలకు సీఎం ఆదేశం. సమాజానికి మంచే చేసే నిర్ణయాల అమల్లో అడుగులు ముందుకు పడాల్సిందే. జాతీయ రహదారుల వెంబడి మద్యం షాపులు వద్దు. దాబాల్లో లిక్కర్ అమ్మకుండా చూడాలని సీఎం ఆదేశం.
రోడ్ సేఫ్టీపై అవగాహన కలిగించాలన్న సీఎం
రోడ్ల నియమాలపై హోర్డింగ్‌లు పెట్టించాలన్న సీఎం. జరిమానాలు విధించే ముందు అవగాహనకు పెద్దపీట వేయాలన్న సీఎం. ఎటువైపు నుంచి ఓవర్టేక్ చేయాలన్నదానిపై సూచనలు చేసేలా హోర్డింగ్స్ పెట్టించాలి. విజయవాడలో ట్రాఫిక్ సమస్యపై సీఎం దృష్టి. సరైన ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశం. దీనిపై అధికారులతో సమావేశం ఏర్పాటుచేయాలని సీఎం ఆదేశం.
ఉభయ గోదావరి జిల్లాలో తాగునీరు పూర్తిగా కలుషితం అయ్యింది
పాదయాత్రలో నేను ప్రజల కష్టాలు చూశాను. తాగునీరు దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. ధవలేశ్వరం నుంచి పైపులైన్ ద్వారా నీటిని తీసుకుని ప్రతిగ్రామంలో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు ఉండేలా చర్యలు తీసుకోవాలి. కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు దీనిపై కలిసి కూర్చోవాలి.
కడపజిల్లా వేముల మండలంలో యురేనియం కర్మాగారం కార్యకలాపాలవల్ల తాగునీరు కలుషితం అవుతుందన్న ప్రజల అభ్యంతరాలపై సీఎం దృష్టి
విశ్వసనీయత ఉన్న ఏజెన్సీతో తాగునీటి పరీక్షలు చేయించాలన్న సీఎం. ఆ నివేదిక వచ్చాక మిగతా విషయాలు చర్చిద్దామన్న సీఎం. యురేనియం కంపెనీ అధికారులు, సబంధిత ప్రజలు, కడప ఎంపీతో సమావేశం ఏర్పాటు చేయాలని, ఈ సమావేశంలో తాను కూడా పాల్గొంటానన్న సీఎం.
ప్రత్యేక హోదాకోసం పోరాటంలో పెట్టిన కేసులను ఎత్తివేయాలని వైయస్ జగన్ ఆదేశం
గుంటూరులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుట ప్లకార్డులు ప్రదర్శించినందుకు దేశద్రోహం కేసు పెట్టారని ప్రస్తావించిన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. ఇలా వ్యవహరిస్తే వ్యవస్థలమీద నమ్మకం ఏం వస్తుందన్న సీఎం.













