పూర్ణాహుతితో శ్రీయాగం పరిసమాప్తం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని కాంక్షిస్తూ కాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ చేపట్టిన మూడు రోజుల శ్రీయాగం పూర్ణాహుతితో పరిసమాప్తమైంది. విజయవాడలోని కేజే గుప్తా కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న పూజల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పాల్గొని గోపూజ నిర్వహంచారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సుబ్రహ్మణ ప్రసాద్ శర్మ నేతృత్వంలో 41 మంది రుత్విక్కులు యాగాన్ని జరిపించారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే మళ్లీ చంద్రబాబు అధికారంలో రావాలని రాధాకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రత్నకుమారి, టీడీపీ నేతలు పాల్గొన్నారు.













