వారికి అయిదు సెంట్ల స్థలంలో ఇల్లు : వైఎస్ జగన్
భారీ వర్షాలు, వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి అయిదు సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించి ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. కడప జిల్లా రాజంపేట మండలం పులపుత్తూరులో వరద బాధితులను ముఖ్యమంత్రి పరామర్శించారు. ఎగువ మందపల్లిలో వరద బాధితులను కూడా ముఖ్యమంత్రి పరామర్శించారు. తొమ్మిది మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన పూజారి రామమూర్తిని ముఖ్యమంత్రి ఓదార్చి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ పులపుత్తూరులో 293 ఇళ్లు దెబ్బతిన్నాయని, వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వరదల కారణంగా డ్వాక్రా డబ్బులు చెల్లించలేమని మహిళలు ఆవేదన వ్యక్తం చేయగా.. ఏడాది పాటు మారటోరియం విధిస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. వాహనాలు కోల్పోయిన వారికి కూడా సాయం చేస్తామని ప్రకటించారు.
పంటలు నష్టపోయిన రైతులందరికీ పరిహారం ఇస్తామని ప్రకటించారు. పొలాల్లో ఇసుక మేటలు తొలగించడానికి హెక్టారుకు రూ.12 వేలు ఇస్తామని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా అందరికీ ఉపాధి కల్పిస్తామన్నారు.. యువత్ కోసం జాబ్ మేళా ఏర్పాటు చేసి ప్రైవేటు, ఔట్ సోర్సింగ్, ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పది రోజుల్లో అన్ని సహాయ కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు. ఎగువ మందపల్లిలో వరద బాధితులను ముఖ్యమంత్రి పరామర్శించారు. తొమ్మిది మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన పూజారి రామమూర్తిని ముఖ్యమంత్రి ఓదార్చి భరోసా ఇచ్చారు.













