ఏపీ-సింగపూర్ మధ్య చారిత్రక ఒప్పందం
ఆంధ్రప్రదేశ్-సింగపూర్ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరిందని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఆయన భేటీ అయ్యారు. ఇరువురి మధ్య స్నేహపూరిత సంబంధాలు, భాగస్వామ్యాలు, ఒప్పందాలపై ప్రధానంగా చర్చలు జరిగాయి. అనంతరం ఈశ్వరన్ మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి న్యాయపరైన ఇబ్బందులు రాకుండా ఒప్పందాలు చేసుకున్నామన్నారు. విస్తృత ప్రయోజనాల కోసం ఏపీతో కలిసి పనిచేస్తామన్నారు. అమరావతి పార్టనర్షిప్ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మించేందుకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు. వరల్డ్ సిటీ సమ్మిట్‌లో అమరావతి నిర్మాణాన్ని ప్రస్తావిస్తామని ఈశ్వరన్ సృష్టం చేశారు.
నవ్యాంధ్ర ప్రజలకు శుభవార్త
నవ్యాంధ్ర ప్రజలకు శుభవార్త. జులైలో విజయవాడ నుంచి సింగపూర్‌కు నేరుగా విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన విజ్ఞప్తి మేరకు వచ్చే నెలలో విజయవాడ నుంచి సింగపూర్‌కు విమాన సేవలు ప్రారంభించనున్నట్లు సింగపూర్ సమాచార శాఖ మంత్రి ఈశ్వరన్ ప్రకటించారు.













