అమరావతిలో మాల్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 10 ఎకరాల్లో మాల్ ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మున్ముందు రాజథానిలో జనాభా పెరుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ ఆథారిటీ (సీఆర్డీయే) పరిధిలో అభివృద్ధి పనుల పురోగతిపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఘన వ్యర్థాల నిర్వహణకు రూ.166 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఇందుకోసం వివిధ ఆర్థిక సంస్థల నుంచి వనరులను సమకూర్చుకోవాలని చంద్రబాబు సీఆర్డీయే అధికారులకు సూచించారు. బాండ్ల ద్వారా రాజధాని నిర్మాణంలో ఎన్ఆర్ఐలను భాగస్వాములను చేయాలన్న ప్రతిపాదనపై సమీక్షా సమావేశంలో చర్చించారు.













