Chandrababu: గవర్నర్‌గా ఆయన నియామకం ఏపీ ప్రజలకు గర్వకారణం : చంద్రబాబు
గోవా గవర్నర్‌గా నియమితులైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు (Ashoka Gajapati Raju ) కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అభినందనలు తెలిపారు. గవర్నర్‌గా ఆయన నియామకం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గర్వకారణమన్నారు. గవర్నర్‌గా అశోక్‌ను నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) , ప్రధాని మోదీ (Prime Minister Modi) కి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. అశోక్‌గజపతి విజయవంతంగా పదవీకాలం పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు.
అశోక్ గజపతిరాజుకు మంత్రి లోకేశ్ (Minister Lokesh) అభినందనలు తెలిపారు. ఆయనకు ఈ గౌరవాన్ని అందించిన రాష్ట్రపతి, ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. నిజాయతీ, నిబద్ధతతో గవర్నర్ పదవికి అశోక్ గజపతి వన్నె తెస్తారని విశ్వసిస్తున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు. స్పీకర్ అయన్నపాత్రుడు కూడా అశోక్ గజపతికి శుభాకాంక్షలు తెలిపారు.













