శ్రీవారి సేవలో ఇద్దరు ముఖ్యమంత్రులు
తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కర్ణాకట ముఖ్యమంత్రి యడియూరప్ప దర్శించుకున్నారు. ముందుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్న జగన్ మహాద్వారం వద్ద యడియూరప్పకు స్వాగతం పలికారు. రంగనాయక మండపంలో వేద పండితులు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆశీర్వచనం పలికారు. యడియూరప్పకు జగన్ శ్రీవారి శేషవస్త్రం బహుకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఇద్దరు ముఖ్యమంత్రులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు.













