1000 కోట్ల అభివృద్ధి పనులను ఆవిష్కరించిన జగన్..
ఎన్నికల సమీపిస్తున్న ఈ టైంలో ఏపీ సీఎం జగన్ పలు ప్రాజెక్టులను వరుసగా ప్రారంభించే పనిలో బిజీగా ఉన్నారు. ఈరోజు ఉదయం కడప జిల్లాకు చేరుకున్న జగన్ కు అధికారులు ఘన స్వాగతం పలికారు. తన సొంత నియోజకవర్గమైన పులివెందుల పర్యటనలో భాగంగా జగన్ వైయస్సార్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ ను ప్రారంభించారు. హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కూడా ఆయన ఆవిష్కరించారు. వీటితో పాటుగా జగన్ బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ను ప్రారంభించారు. పండ్ల యొక్క నాణ్యతను చెక్ చేసి ఎగుమతి చేయడానికి అవకాశం కల్పించే ఈ ప్రాజెక్ట్ వల్ల రైతులకు ఎంతో ఉపయోగము కలుగుతుంది అని ఈ సందర్భంగా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి ఈరోజు పులివెందుల, ఇడుపులపాయలో సుమారు వేయికోట్ల రూపాయల అభివృద్ధి పనులను జగన్ ప్రారంభించడం ప్రతిపక్షాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తానికి ఎన్నికలకు ముందు జగన్ పర్దాలు వదిలి కాస్త జనంలోకి వస్తున్నాడు అని ప్రతిపక్షాలు విమర్శలు విసురుతున్నారు.













