గవర్నర్ బిశ్వభూషణ్ కు ఏపీ ప్రభుత్వం వీడ్కోలు
ఛత్తీస్‌గఢ్‌కు నూతన గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. గన్నవరం విమానాశ్రయంలో బిశ్వభూషణ్‌కు ముఖ్యమంత్రి జగన్, సీఎస్ జవహర్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా, ఇతర ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం గవర్నర్ విజయవాడ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు బయల్దేరి వెళ్లారు. సుమారు 44 నెలలపాటు రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసేందుకు తనకు సహకరించిన అందరికీ బిశ్వభూషన్ హరిచందన్ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పట్ల తనకు ఎప్పటికీ అభిమానం ఉంటుందని తెలిపారు.













