శాసనసభ, హైకోర్టు భవనాల ఆకృతుల్లో కీలక మార్పులు : చంద్రబాబు
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మించే శాసనసభ శాశ్వత భవన నిర్మాణ ఆకృతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. నార్మన్ పోస్టర్ ప్రతినిధులు ప్రదర్శించిన ఆకృతులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. శాసనసభ, హైకోర్టు భవనాల ఆకృతుల్లో కీలక మార్పులను చంద్రబాబు సూచించారు. శాసనసభ కోసం సిద్ధం చేసిన బుద్దస్థూపం ఆకృతిని హైకోర్టు కోసం మార్చాలని, అలాగే హైకోర్టు కోసం సిద్ధం చేసిన వజ్రాకార భవన ఆకృతిని శాసనసభ కోసం సిద్ధం చేయాలని సూచించారు. మార్చిన హైకోర్టు డిజైన్‌ను చీఫ్ జస్టిస్‌కు చూపించి తుది ఆకృతులు సిద్ధం చేయాలని కోరారు. హైకోర్టును 4 అంతస్తులుగా రూపకల్పన చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. సాధ్యమైనంత త్వరగా నిర్మాణాలు చేపట్టాలని సూచనలు చేశారు. వాణిజ్య, వినోదం, పరిపాలన సౌకర్యాలు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.













