Chandrababu: క్రికెట్, హాకీ టీమ్‌లకు చంద్రబాబు అభినందనలు

భారత పురుషుల, క్రికెట్ జట్టు (Cricket team) , మహిళల హాకీ జట్టు (Women’s hockey team)కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అభినందనలు తెలిపారు. ఆసియా కప్ 2025లో రజతం పతకం గెలిచిన మహిళల హాకీ జట్టును అభినందించారు. వారు దేశం గర్వపడేలా చేశారని పేర్కొన్నారు. టీమ్ వర్క్, పోరాట స్ఫూర్తిని చూపారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆసియా కప్ 2025లో భాగంగా నిర్వహించిన టీ 20 క్రికెట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ (Pakistan) పై గెలిచిన భారత పురుషుల జట్టుకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. గొప్ప విజయం సాధించారని కొనియాడారు.