ఈ నెల 25న ముస్సోరికి సీఎం చంద్రబాబు
అఖిల భారత సర్వీసుల శిక్షణా సంస్థ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహ్వానం అందింది. శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి ప్రసంగించాలని, వారికి మార్గనిర్దేశం చేయాలని బాబును ఆహ్వానించారు. ఈ వివరాలను ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ నెల 25న ముస్సొరికి వెళుతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్లోని పాలనా సంస్కరణలపై ఐఏఎస్ లతో చంద్రబాబు మాట్లాడనున్నారు. ఇన్-సర్వీస్ ఐఏఎస్లు, శిక్షణలో ఉన్న ఐఏఎస్ లతో జాయింట్ సెషన్లో చంద్రబాబు పాల్గొంటారని అధికారులు తెలిపారు.













